యెహోషువ 8:30
చుట్టుపక్కల సందర్భంతో వచనం 30 చూపబడుతోంది.
27
అయితే యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులు ఈ పట్టణంలోని పశువులను, దోపుడుసొమ్మును తమ కోసం తీసుకెళ్లారు.
28
కాబట్టి యెహోషువ హాయిని కాల్చివేసి, దానిని శాశ్వత శిధిలాల కుప్పగా చేశాడు, ఇప్పటికీ అది నిర్జన ప్రదేశంగానే ఉంది.
29
అతడు హాయి రాజును సాయంకాలం వరకు స్తంభానికి వ్రేలాడదీశాడు. సూర్యాస్తమయ సమయంలో యెహోషువ ఆ మృతదేహాన్ని స్తంభం నుండి క్రిందికి దించి పట్టణ ద్వారం దగ్గర పడవేయమని ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేసి దానిపై ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు. అది ఇప్పటికీ అలాగే ఉంది.
30
యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు, యెహోషువ ఏబాలు పర్వతం మీద ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టాడు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన దాని ప్రకారం అతడు చెక్కని రాళ్లతో ఎటువంటి ఇనుప సాధనం వాడకుండ దాన్ని కట్టాడు. దానిపై వారు యెహోవాకు దహనబలులు సమాధానబలులు అర్పించారు.
32
ఇశ్రాయేలీయుల సమక్షంలో, యెహోషువ మోషే ధర్మశాస్త్ర ప్రతిని రాళ్లపై వ్రాశాడు.
33
ఇశ్రాయేలీయులందరు, వారి పెద్దలు, అధికారులు, న్యాయాధిపతులతో పాటు యెహోవా నిబంధన మందసానికి ఇరువైపులా, దానిని మోస్తున్న లేవీయ యాజకులకు ఎదురుగా నిలబడ్డారు. వారి మధ్య నివసిస్తున్న విదేశీయులు, స్థానికంగా పుట్టినవారు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి యెహోవా సేవకుడైన మోషే గతంలో సూచనలు ఇచ్చినప్పుడు ఆజ్ఞాపించినట్లుగా వారిలో సగం మంది ప్రజలు గెరిజీము పర్వతం ముందు, సగం మంది ఏబాలు పర్వతం ముందు నిలబడ్డారు.
Settings