Skip to content
యెహోషువ 6:22-25

రాహాబు, ఆమె కుటుంబము రక్షింపబడుట

యెహోషువ 6:22-25
22
ఆ దేశాన్ని వేగు చూసిన ఇద్దరు వ్యక్తులతో యెహోషువ ఇలా అన్నాడు: “మీరు వేశ్య ఇంటికి వెళ్లి మీరు ఆమెతో చేసిన ప్రమాణం ప్రకారం ఆమెను, ఆమెకు చెందిన వారందరినీ బయటకు తీసుకురండి.”
23
కాబట్టి వేగు చూసిన యువకులు లోపలికి వెళ్లి రాహాబును, ఆమె తండ్రిని, తల్లిని, ఆమె సోదరులు, సోదరీమణులను, ఆమెకు చెందిన వారందరినీ బయటకు తీసుకువచ్చారు. వారు ఆమె కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి ఇశ్రాయేలు శిబిరం బయట ఒకచోట ఉంచారు.
24
ఆ తర్వాత వారు ఆ పట్టణాన్ని, దానిలోని సమస్తాన్ని కాల్చివేసి, వెండి బంగారాన్ని, ఇత్తడి ఇనుప వస్తువులను యెహోవా మందిరంలోని ఖజానాలో పెట్టారు.
25
అయితే యెరికోకు వేగులవారిగా యెహోషువ పంపిన వారిని దాచిపెట్టింది కాబట్టి, వేశ్యయైన రాహాబును ఆమె కుటుంబంతో పాటు ఆమెకు సంబంధించిన వారందరినీ విడిచిపెట్టాడు; ఆమె ఈనాటికీ ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తుంది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options