26
ఆ సమయంలో యెహోషువ ఈ గంభీరమైన ప్రమాణం చేశాడు: “యెరికో పట్టణాన్ని మరలా కట్టాలనుకునేవాడు యెహోవా ఎదుట శాపగ్రస్తుడు: “దాని పునాది వేసే వాడి పెద్దకుమారుడు చనిపోతాడు దాని తలుపులను నిలబెట్టేవాడి చిన్నకుమారుడు చనిపోతాడు.”
27
యెహోవా యెహోషువతో ఉన్నారు కాబట్టి అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది.