యెహోషువ 21:43-45
43
కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయులకు వారి పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశమంతా ఇచ్చారు, వారు దానిని స్వాధీనం చేసుకుని అక్కడ స్థిరపడ్డారు.
44
యెహోవా వారి పూర్వికులతో ప్రమాణం చేసినట్లే వారికి అన్నివైపులా విశ్రాంతిని ఇచ్చారు. వారి శత్రువులలో ఒక్కరు కూడా ఇశ్రాయేలీయులకు ఎదురు నిలబడలేకపోయారు; యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించారు.
45
ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మంచి వాగ్దానాలలో నెరవేరకుండా ఒక్కటి కూడా లేదు; ప్రతి ఒక్కటి నెరవేరింది.
Settings