యోవేలు 3:9-16
9
దేశాల మధ్య ఈ విషయం చాటించండి, యుద్ధానికి సిద్ధపడండి! వీరులను పురికొల్పండి, పోరాడేవారందరు సమకూడి వచ్చి దాడి చేయాలి.
10
మీ నాగటి నక్కులను సాగగొట్టి ఖడ్గాలు చేయండి, మడ్డికత్తులను సాగగొట్టి ఈటెలుగా చేయండి. “నేను బలవంతున్ని!” అని బలహీనులు అనుకోవాలి.
11
ప్రతి వైపు ఉన్న అన్ని దేశాల్లారా, త్వరగా రండి, అక్కడ సమకూడండి. యెహోవా, మీ వీరులను తీసుకురండి!
12
“దేశాలు లేవాలి; అవి యెహోషాపాతు లోయ వైపు వెళ్లాలి నలుదిశల ఉన్న అన్ని దేశాలకు తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.
13
పంట పండింది కాబట్టి, కొడవలి తిప్పండి, ద్రాక్షగానుగ నిండింది తొట్లు పొర్లి పారుతున్నాయి కాబట్టి రండి, ద్రాక్షలను త్రొక్కండి, వారి దుష్టత్వం అధికంగా ఉంది!”
14
తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు, ఎందుకంటే తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం ఆసన్నమైంది.
15
సూర్యచంద్రులు చీకటిగా మారుతాయి, నక్షత్రాలు ఇక ప్రకాశించవు.
16
యెహోవా సీయోను నుండి గర్జిస్తారు, యెరూషలేములో నుండి ఉరుముతారు; భూమ్యాకాశాలు వణకుతాయి, అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయంగా ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలకు దుర్గంగా ఉంటారు.
Settings