Skip to content
యోబు 6:24-30

ప్రయోజనకరమైన ఉపదేశము కోరిన యోబు

యోబు 6:24-30
24
“నాకు బోధించండి, నేను మౌనంగా ఉంటాను; నా తప్పేంటో నేను గ్రహించేలా నాకు చూపించండి.
25
యథార్థమైన మాటలు ఎంతో బాధాకరమైనవి, కాని మీ వాదనలు ఏమి నిరూపిస్తున్నాయి?
26
నేను చెప్పే మాటలను సరిచేయాలని చూస్తున్నారా, నిరాశతో కూడిన నా మాటలు గాలివంటివే అని అనుకుంటున్నారా?
27
మీరు తండ్రిలేనివారిని కొనడానికి చీట్లు వేస్తారు, మీ స్నేహితుని మీద బేరమాడతారు.
28
“అయితే ఇప్పుడు నన్ను దయతో చూడండి, మీ ముఖాలు చూస్తూ అబద్ధం చెప్పగలనా?
29
పశ్చాత్తాపపడండి, అన్యాయం చేయకండి; మరలా విచారించండి ఎందుకంటే నాలో ఇంకా యథార్థత ఉంది.
30
నా పెదవుల మీద దుష్టత్వం ఉందా? నా నోరు దుర్మార్గాన్ని గ్రహించలేదా?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options