యోబు 41:1-5
1
“లెవియాథన్ ను చేపగాలంతో లాగగలవా? త్రాడుతో దాని నాలుకను కట్టగలవా?
2
దాని జమ్ము తాడును ముక్కుకు వేయగలవా? దవడకు గాలం ఎక్కించగలవా?
3
దయచూపమని అది నిన్ను వేడుకుంటుందా? మృదువైన మాటలు నీతో మాట్లాడుతుందా?
4
జీవితాంతం నీవు దానిని బానిసగా ఉంచుకునేలా అది నీతో ఒప్పందం చేసుకుంటుందా?
5
ఒక పక్షితో ఆడుకున్నట్లు నీవు దానితో ఆడుకుంటావా? నీ ఇంట్లోని అమ్మాయిలు ఆడుకోడానికి దానిని కట్టి ఉంచగలవా?
Settings