Skip to content
యోబు 4:7-11

ప్రతిఫల సిద్ధాంతము

యోబు 4:7-11
7
“ఇప్పుడు ఆలోచించు: నిర్దోషిగా ఉన్నవాడు ఎప్పుడైనా నశించాడా? యథార్థవంతులు ఎప్పుడైనా నాశనమయ్యారా?
8
నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు.
9
దేవుని శ్వాసకు వారు నశిస్తారు; ఆయన ధ్వంసం చేయు కోపం ద్వారా వారు ఇక ఉండరు.
10
సింహాలు గర్జిస్తాయేమో కొదమసింహాలు కేకలు వేస్తాయేమో, అయినా అలాంటి బలమైన సింహాల కోరలు విరిగిపోతాయి.
11
సింహం తిండి దొరకక నశిస్తుంది, సింహం యొక్క కూనలు చెదిరిపోతాయి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options