యోబు 39:16-21
16
తన పిల్లలు తనవి కానట్టు, వాటిని కఠినంగా చూస్తుంది; తన ప్రసవ వేదనంతా వృధా అయినా అది పట్టించుకోదు.
17
ఎందుకంటే దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదు దానికి గ్రహింపు ఇవ్వలేదు.
18
అయినా పరుగెత్తడానికి అది తన రెక్కలను చాపినప్పుడు, అది గుర్రాన్ని దాని రౌతును చూసి నవ్వుతుంది.
19
“గుర్రానికి దాని బలాన్ని నీవిస్తావా? దాని మెడ మీద జూలు పెట్టింది నీవా?
20
దాని భీకరమైన గురకతో భయాన్ని సృష్టించే మిడతలా, మీరు దానిని దూకేలా చేస్తారా?
21
అది తన బలాన్నిబట్టి సంతోషిస్తూ, ఆగ్రహంతో నేలను దువ్వి, పోరాడటానికి పరుగెడుతుంది.
Settings