Skip to content
యోబు 39:13-18

జ్ఞానము లేని ఉష్ట్రపక్షి

యోబు 39:13-18
13
“నిప్పుకోడి రెక్కలు సంతోషంతో ఆడిస్తుంది, అయినా కొంగకున్న రెక్కలు ఈకలతో అవి పోల్చబడకపోయినా.
14
అది నేలమీద గుడ్లు పెడుతుంది ఇసుకలో వాటిని పొదుగుతుంది.
15
ఏ పాదమో వాటిని నలిపివేస్తుందని, ఏ అడవి జంతువో వాటిని త్రొక్కివేస్తుందని అది ఆలోచించదు.
16
తన పిల్లలు తనవి కానట్టు, వాటిని కఠినంగా చూస్తుంది; తన ప్రసవ వేదనంతా వృధా అయినా అది పట్టించుకోదు.
17
ఎందుకంటే దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదు దానికి గ్రహింపు ఇవ్వలేదు.
18
అయినా పరుగెత్తడానికి అది తన రెక్కలను చాపినప్పుడు, అది గుర్రాన్ని దాని రౌతును చూసి నవ్వుతుంది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options