యోబు 36:22-26
22
“దేవుడు శక్తిమంతుడైన గొప్పవాడు. ఆయనలాంటి బోధకుడెవరు?
23
ఆయనకు మార్గాలను ఎవరు నిర్దేశించారు, ‘నీవు తప్పు చేశావు’ అని ఆయనతో ఎవరు చెప్పారు?
24
ప్రజలు పాటలతో కీర్తించిన ఆయన కార్యాలను ఘనపరచాలని నీవు జ్ఞాపకముంచుకో.
25
మనుష్యులందరు వాటిని చూశారు; మనుష్యులు దూరంగా ఉండి వాటిని చూశారు.
26
దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహించలేము! ఆయన సంవత్సరాలను లెక్కించలేనివి.
Settings