కంటెంట్‌కు వెళ్లండి
యోబు 33:19-30

పునరుద్ధరణకు సాధనమైన బాధ

యోబు 33:19-30
19
“లేదా ఒకరు ఎముకల్లో నిరంతరం బాధ కలిగి నొప్పితో మంచం పట్టడం ద్వారా శిక్షించబడతారు.
20
అప్పుడు వారికి అన్నం సహించదు వారికి ఇష్టమైన భోజనమైనా సరే అసహ్యంగా ఉంటుంది.
21
వారి మాంసం కృషించిపోయి, ఇంతకుముందు కనిపించని ఎముకలు ఇప్పుడు బయటకు కనబడతాయి.
22
వారు సమాధికి దగ్గరవుతారు, వారి ప్రాణాలు మరణ దూతలకు దగ్గరవుతాయి.
23
అయినాసరే వారికి ఒక దేవదూత ఉంటే, వేలాది దేవదూతల్లో ఒక దూతను, మనుష్యులు యథార్థంగా ఎలా ఉండాలో చెప్పడానికి పంపితే,
24
ఆ దూతకు వారిపై దయ కలిగి దేవునితో, ‘వారిని సమాధిలోనికి దిగిపోకుండా కాపాడండి; వారి కోసం క్రయధనం నాకు దొరికిందని చెప్తాడు.
25
అప్పుడు వారి దేహం చిన్నపిల్లల దేహంలా ఉంటుంది; వారికి తమ యవ్వనకాలం తిరిగి వస్తుంది.’
26
అప్పుడు వారు దేవునికి ప్రార్థించి ఆయన దయను పొందవచ్చు, వారు దేవుని ముఖం చూసి ఆనందంతో కేకలు వేస్తారు; ఆయన వారి నీతిని వారికి తిరిగి ఇస్తారు.
27
వారు ఇతరుల దగ్గరకు వెళ్లి ఇలా చెప్తారు, ‘నేను పాపం చేశాను, సరియైన దానిని వంకరగా మార్చాను, అయినా దానికి తగిన శిక్ష నాకు విధించబడలేదు.
28
సమాధికి వెళ్లకుండ దేవుడు నా ప్రాణాన్ని విమోచించారు. జీవిత వెలుగును ఆస్వాదించడానికి నేను బ్రతుకుతాను.’
29
“జీవిత వెలుగు వారి మీద ప్రకాశించేలా వారిని సమాధి నుండి తప్పించడానికి, దేవుడు మానవుల కోసం వీటన్నిటిని రెండు, మూడు సార్లైనా చేస్తారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options