31
“యోబూ, నా మాటలు విను; శ్రద్ధగా ఆలకించు, మౌనంగా ఉండు, నేను మాట్లాడతాను.
32
నీవు చెప్పవలసినది ఏదైనా ఉంటే నాతో చెప్పు; మాట్లాడు, నీ దోషమేమీ లేదని నేను నిరూపించదలిచాను.
33
కాని ఒకవేళ ఏమిలేకపోతే, నేను చెప్పేది విను; మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను.”