యోబు 33:12-18
12
“కాని ఈ విషయంలో నీవు తప్పు, ఎందుకంటే దేవుడు మానవుల కంటే గొప్పవాడు.
13
ఒకని మాటలకు ఆయన స్పందించరని ఎందుకు నీవు ఆయనకు ఫిర్యాదు చేస్తావు?
14
ఎందుకంటే దేవుడు ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడతారు, అయితే ఎవరు దానిని గ్రహించలేరు.
15
ప్రజలు పడకపై పడుకుని, గాఢనిద్రలో ఉన్నప్పుడు, రాత్రి వచ్చే కలలో,
16
నరులను గర్విష్ఠులు కాకుండచేయాలని వారు చేయదలచిన తప్పులను చేయకుండా వారిని ఆపడానికి, గోతిలో పడకుండ వారిని కాపాడడానికి, ఖడ్గం ద్వార వారి ప్రాణాలు పోకుండ వారిని తప్పించాలని ఆయన వారి చెవుల్లో మాట్లాడవచ్చు హెచ్చరికలతో వారిని భయపెట్టవచ్చు.
Settings