యోబు 30:9-15
9
“అలాంటి వారికి నేను హేళన పాట అయ్యాను; వారికి నేను ఓ సామెతను అయ్యాను.
10
వారు నన్ను చూసి అసహ్యించుకుని దూరంగా జరుగుతున్నారు; నా ముఖం మీద ఉమ్మివేయడానికి కూడా వెనుకాడరు.
11
దేవుడు నా విల్లును విప్పి నన్ను బాధపెట్టారు, వారు నా సమక్షంలో సంయమనాన్ని వదిలేశారు.
12
నా కుడి వైపున తెగ దాడులు; వారు నా పాదాలకు వలలు వేస్తారు, నాకు వ్యతిరేకంగా తమ నాశన ప్రయత్నాలను చేస్తున్నారు.
13
నా మార్గాన్ని పాడుచేస్తున్నారు; నన్ను నాశనం చేయడంలో వారు విజయం సాధించారు. వారిని అడ్డుకునేవారు లేరు.
14
గండిపడిన పెద్ద ప్రవాహంవలె వారు వస్తారు; పతనంలా వారు దొర్లుతూ వస్తారు.
15
భయాలు నన్ను ముంచెత్తుతాయి; నా గౌరవం గాలిలా తరిమివేయబడింది, నా భద్రత మేఘంలా అదృశ్యమవుతుంది.
Settings