యోబు 30:25-31
25
ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం నేను ఏడవలేదా? పేదవారిని చూసి నా ప్రాణం దుఃఖపడలేదా?
26
అయినాసరే నేను మేలు జరుగుతుందని ఆశిస్తే, కీడు జరిగింది; నేను వెలుగు కోసం చూస్తే, చీకటి వచ్చింది.
27
నా లోపల చిందరవందర ఎప్పుడూ ఆగదు; శ్రమ దినాలు నాకెదురయ్యాయి.
28
నేను నల్లబడతాను, కాని సూర్యుని ద్వారా కాదు; నేను సమాజంలో నిలబడి సహాయం కోసం మొరపెడతాను.
29
నేను నక్కలకు సోదరుడనయ్యాను, గుడ్లగూబలకు సహచరుడనయ్యాను.
30
నా చర్మం నల్లబడి రాలిపోతుంది; నా శరీరం జ్వరంతో కాలిపోతుంది.
31
నా వీణ దుఃఖానికి, నా పిల్లనగ్రోవి రోదన ధ్వనికి శ్రుతి చేయబడింది.
Settings