1
“యవ్వనస్త్రీని కామదృష్టితో చూడనని నేను నా కళ్లతో ఒడంబడిక చేసుకున్నాను.
2
పైనున్న దేవుని నుండి మనకు ఉన్న భాగం, ఉన్నతస్థలంలోని సర్వశక్తిమంతుని నుండి మన వారసత్వమేమి?
3
అది దుష్టులకు పతనం, తప్పు చేసేవారికి విపత్తు కాదా?
4
ఆయన నా మార్గాలను చూడరా నా ప్రతి అడుగును లెక్కించరా?