Skip to content
యోబు 28:1-11

యోబు 28:1-11

1
వెండికి గని ఉన్నది బంగారాన్ని పుటం వేయడానికి ఒక స్థలం ఉన్నది.
2
ఇనుము మట్టిలో నుండి తీయబడుతుంది, ధాతువు కరిగించి రాగి తీస్తారు.
3
చీకటిలో కాంతిని ఎలా ప్రకాశింప చేయాలో మానవులకు తెలుసు; ధాతువు కోసం చీకటిలో శోధిస్తున్నప్పుడు భూమి యొక్క సుదూర ప్రాంతాలను అన్వేషిస్తారు.
4
మనుష్యుల నివాస స్థలాలకు దూరంగా, మానవ అడుగులు పడని చోట్లలో; వ్రేలాడుతూ ఊగుతూ సొరంగాలు త్రవ్వుతారు.
5
భూమిపై ఆహారం పెంచబడుతుంది, కాని దాని లోపలి భాగం అగ్నికి కరిగిపోయి ఉంటుంది.
6
దాని రాళ్లల్లో నీలమణులుంటాయి. దాని మట్టిలో బంగారం ఉంటుంది.
7
దాని త్రోవ ఏ గ్రద్దకు తెలియదు, డేగ కన్ను కూడా దానిని చూడలేదు.
8
గర్వంగల క్రూరమృగాలు ఆ దారిలో అడుగుపెట్టలేదు, ఏ సింహం అక్కడ నడవలేదు.
9
మనుష్యులు తమ చేతులతో చెకుముకిరాయి మీద దాడి చేస్తారు. కొండలను వాటి పునాదులతో సహా పెకిలించి వేస్తారు.
10
బండలో వారు సొరంగం త్రవ్వుతారు. దాని నిధులను వారి కళ్లు పసిగడుతుంది.
11
వారు నదుల మూలాలను శోధిస్తారు, మరుగున పడి ఉన్నవాటిని వెలుగులోనికి తెస్తారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options