యిర్మీయా 50:8-16
8
“బబులోను నుండి పారిపోండి; బబులోనీయుల దేశాన్ని విడిచిపెట్టండి, మందను నడిపించే మేకపోతుల్లా ప్రజల ముందు నడవండి.
9
నేను బబులోనుకు వ్యతిరేకంగా ఉత్తర దేశం నుండి గొప్ప దేశాల కూటమిని రప్పిస్తాను. వారు దానికి వ్యతిరేకంగా యుద్ధపంక్తులు తీర్చుతారు, ఉత్తరం నుండి దాన్ని పట్టుకుంటారు. వారి బాణాలు వట్టి చేతులతో తిరిగి రాని నైపుణ్యం కలిగిన యోధుల వలె ఉంటాయి.
10
కాబట్టి బబులోను దోచుకోబడుతుంది; దాన్ని దోచుకునే వారందరూ సంతృప్తి చెందుతారు” అని యెహోవా ప్రకటించాడు.
11
“నా స్వాస్థ్యాన్ని దోచుకునేవారలారా, అది మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది ధాన్యం నూర్పిడి చేస్తున్న దూడలా బలమైన గుర్రాల్లా మీరు సకిలిస్తున్నారు.
12
నీ తల్లి చాలా సిగ్గుపడుతుంది; నీకు జన్మనిచ్చిన ఆమె పరువు పోతుంది. అది దేశాలన్నిటిలో నీచమైనదిగా అరణ్యంగా, ఎండిన భూమిగా, ఎడారిగా ఉంటుంది.
13
యెహోవా కోపం వలన అది నివాసయోగ్యంగా ఉండదు. పూర్తిగా నిర్జనమైపోతుంది. బబులోను దాటి వెళ్లే వారందరూ నివ్వెరపోతారు; దాని గాయాలన్నిటిని బట్టి వారు ఎగతాళి చేస్తారు.
14
“బబులోను చుట్టూ యుద్ధపంక్తులు తీరండి, విల్లును వంచగలిగిన ప్రతి ఒక్కరు విల్లు లాగండి. అది యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసింది, దానిపై బాణాలు వేయండి! మీ బాణాలు దాచుకోవద్దు.
15
అన్ని వైపుల నుండి దానిమీద కేకలు వేయండి! అది లొంగిపోతుంది, దాని బురుజులు పడిపోయాయి, దాని గోడలు కూలిపోయాయి. ఇది యెహోవా ప్రతీకారం కాబట్టి, దాని మీద ప్రతీకారం తీర్చుకోండి; అది ఇతరులకు చేసినట్లు దానికి చేయండి.
16
బబులోను నుండి విత్తేవారిని, కొడవలితో కోత కోసేవారిని నిర్మూలం చేయండి. అణచివేసే వారి ఖడ్గం కారణంగా ప్రతి ఒక్కరూ తమ ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరూ తమ సొంత దేశానికి పారిపోతున్నారు.
Settings