Skip to content
యిర్మీయా 32:2-5

యిర్మీయా 32:2-5

2
బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద దాడి చేస్తున్నప్పుడు యిర్మీయా ప్రవక్త యూదా రాజభవనంలోని కావలివారి ప్రాంగణంలో బంధించబడ్డాడు.
3
యూదా రాజైన సిద్కియా అతన్ని అక్కడ బంధించి, “నీవు అలా ఎందుకు ప్రవచిస్తున్నావు? పైగా నీవంటున్నావు, ‘యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను, అతడు దానిని స్వాధీనం చేసుకుంటాడు.
4
యూదా రాజైన సిద్కియా బబులోనీయుల నుండి తప్పించుకోడు, అతడు బబులోను రాజు చేతికి ఖచ్చితంగా అప్పగించబడతాడు, సిద్కియా అతనితో ముఖాముఖి మాట్లాడతాడు తన కళ్లారా అతన్ని చూస్తాడు.
5
అతడు సిద్కియాను బబులోనుకు తీసుకెళ్తాడు, నేను అతని సంగతి చూసే వరకు అతడు అక్కడే ఉంటాడని యెహోవా ప్రకటిస్తున్నారు. ఒకవేళ మీరు బబులోనీయులతో పోరాడితే విజయం సాధించలేరు’ అని చెప్పావు” అన్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options