కంటెంట్‌కు వెళ్లండి
యిర్మీయా 30:12-17

నయం కాని గాయం మరియు దైవిక స్వస్థత

యిర్మీయా 30:12-17
12
“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ గాయం నయం కానిది, నీ గాయం తీవ్రమైనది.
13
నీ పక్షంగా వాదించడానికి ఎవరు లేరు, నీ పుండుకు నివారణ లేదు, నీకు స్వస్థత లేదు.
14
నీ స్నేహితులందరు నిన్ను మరచిపోయారు; వారు నీ గురించి ఏమీ పట్టించుకోరు. శత్రువు కొట్టినట్లుగా నేను నిన్ను కొట్టి, క్రూరమైనవానిలా నిన్ను శిక్షించాను, ఎందుకంటే నీ అపరాధం చాలా పెద్దది, నీ పాపాలు చాలా ఎక్కువ.
15
నీ గాయం గురించి, తీరని నీ బాధ గురించి ఎందుకు ఏడుస్తున్నావు? నీ గొప్ప అపరాధం అనేక పాపాల కారణంగా నేను నీకు ఇవన్నీ చేశాను.
16
“ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను.
17
అయితే నేను నీకు స్వస్థత కలుగజేసి నీ గాయాలను బాగుచేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే ‘నీవు వెలివేయబడినవాడవని, సీయోనును ఎవ్వరూ పట్టించుకోరు’ అని నీ గురించి అన్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options