Skip to content
యెషయా 44:1-5

యెషయా 44:1-5

1
“అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలూ, విను.
2
నిన్ను పుట్టించి, గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసేవాడైన యెహోవా చెప్పే మాట ఇదే: నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకున్న యెషూరూను భయపడకు.
3
నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు, ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానంపై నా ఆత్మను, నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను.
4
వారు మైదానంలో గడ్డిలా పెరుగుతారు, నీటికాలువల దగ్గర నాటిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు.
5
కొంతమంది, ‘నేను యెహోవా వాడను’ అని అంటారు; ఇతరులు యాకోబు పేరుతో తమను తాము పిలుచుకుంటారు; ఇంకా కొందరు తమ చేతిపై ‘యెహోవా వారము’ అని రాసుకుని ఇశ్రాయేలు పేరును పెట్టుకుంటారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options