Skip to content
యెషయా 38:16-20

యెషయా 38:16-20

16
ప్రభువా! వీటి వలన మనుష్యులు జీవిస్తారు. వాటిలో కూడా నా ఆత్మకు జీవం దొరుకుతుంది. మీరు నాకు ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చారు నన్ను జీవింపచేశారు.
17
నేను అనుభవించిన ఈ వేదన ఖచ్చితంగా నాకు నెమ్మది కలగడానికే. మీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతినుండి విడిపించారు; నా పాపాలన్నిటిని మీ వెనుక పారవేశారు.
18
ఎందుకంటే, సమాధి మిమ్మల్ని స్తుతించలేదు, మరణం మీకు స్తుతులు పాడలేదు. సమాధిలోనికి వెళ్లేవారు మీ నమ్మకత్వం కోసం నిరీక్షించలేరు.
19
నేను ఈ రోజు స్తుతిస్తున్నట్లు, సజీవులు, సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారు; తల్లిదండ్రులు తమ పిల్లలకు మీ నమ్మకత్వాన్ని తెలియజేస్తారు.
20
యెహోవా నన్ను రక్షిస్తారు. మనం బ్రతికినన్ని రోజులు యెహోవా మందిరంలో తంతి వాద్యాలు వాయిస్తూ పాడదాము.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options