యెషయా 36:18-20
18
“హిజ్కియా, ‘యెహోవా మనల్ని విడిపిస్తారు’ అని చెప్తూ మిమ్మల్ని తప్పుత్రోవ పట్టనివ్వకండి. ఇతర దేశాల దేవుళ్ళు ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించారా?
19
హమాతు, అర్పదు దేవుళ్ళు ఎక్కడ? సెఫర్వయీము దేవుళ్ళు ఎక్కడ? వారు నా చేతిలో నుండి సమరయను రక్షించగలిగారా?
20
ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తమ దేశాలను నా చేతిలో నుండి రక్షించగలిగారా? అలాగైతే, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును ఎలా విడిపిస్తారు?”
Settings