యెషయా 33:7-13
7
చూడండి, వారి యోధులు వీధుల్లో ఘోరంగా ఏడుస్తున్నారు; సమాధాన రాయబారులు ఎక్కువగా ఏడుస్తున్నారు.
8
రహదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి దారుల్లో ప్రయాణికులు లేరు. ఒప్పందాన్ని మీరారు, పట్టణాలను అవమానపరిచారు, ఏ ఒక్కరూ గౌరవించబడరు.
9
దేశం ఎండిపోయి క్షీణించిపోతుంది, లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది; షారోను ఎడారిలా మారింది బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుతాయి.
10
యెహోవా ఇలా అంటున్నారు, “ఇప్పుడు నేను లేస్తాను, ఇప్పుడు నేను ఘనపరచబడతాను; ఇప్పుడు నేను హెచ్చింపబడతాను
11
మీరు పొట్టును గర్భం ధరించి గడ్డికి జన్మనిస్తారు; మీ ఊపిరి అగ్నిలా మిమ్మల్ని కాల్చివేస్తుంది.
12
ప్రజలు కాలి బూడిద అవుతారు; వారు నరకబడిన ముళ్ళపొదల్లా కాల్చబడతారు.”
13
దూరంగా ఉన్నవారలారా, నేను ఏమి చేశానో వినండి; దగ్గరగా ఉన్నవారలారా, నా బలాన్ని గుర్తించండి!
Settings