Skip to content
యెషయా 13:1-7

యెషయా 13:1-7

1
బబులోను గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన ప్రవచనం:
2
చెట్లులేని కొండ శిఖరం మీద జెండా నిలబెట్టండి, కేకలు వేసి వారిని పిలువండి; ప్రజల ప్రధానులను గుమ్మాల్లో చేతులతో సైగ చేయండి.
3
నేను యుద్ధానికి ప్రతిష్ఠించిన వారికి ఆజ్ఞ ఇచ్చాను; నా కోపం తీర్చుకోవాలని నా వీరులను పిలిపించాను, నా విజయాన్ని బట్టి సంతోషించేవారిని పిలిపించాను.
4
పెద్ద జనసమూహం ఉన్నట్లుగా కొండల్లో వస్తున్న శబ్దం వినండి! దేశాలు ఒక్కటిగా చేరుతునట్లు రాజ్యాల మధ్య అల్లరి శబ్దం వినండి! సైన్యాల యెహోవా యుద్ధానికి సైన్యాన్ని సమకూరుస్తున్నారు.
5
దేశాన్ని మొత్తం పాడుచేయడానికి, యెహోవా కోపాన్ని తీర్చే ఆయుధాలుగా, వారు దూరదేశం నుండి, ఆకాశపు అంచుల నుండి వస్తున్నారు.
6
యెహోవా దినం దగ్గరలో ఉందని రోదించండి; అది సర్వశక్తుడు దేవుని దగ్గర నుండి వచ్చే నాశనంలా వస్తుంది.
7
దీనిని బట్టి, చేతులన్నీ బలహీనపడతాయి, ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options