హోషేయ 4:1-6
1
ఇశ్రాయేలీయులారా, యెహోవా వాక్కు వినండి, యెహోవా ఈ దేశ వాసులైన మీమీద నేరం మోపుతున్నారు: “ఈ దేశంలో నమ్మకత్వం, ప్రేమ దేవుని గురించిన జ్ఞానం అనేవి లేవు.
2
శపించడం, అబద్ధాలు చెప్పడం, హత్య చేయడం, దొంగిలించడం, వ్యభిచారం చేయడం మాత్రమే ఉన్నాయి; వారు దౌర్జన్యాలు మానలేదు, నిత్యం రక్తపాతం జరుగుతూ ఉంది.
3
ఈ కారణంచేత దేశం ఎండిపోతుంది, అందులో నివసించేవారు నీరసించి పోతున్నారు; అడవి జంతువులు, ఆకాశపక్షులు, సముద్రపు చేపలు నశించిపోతున్నాయి.
4
“అయితే ఏ ఒకరిపై నేరం మోపకండి, ఏ ఒక్కరు ఇంకొకరిని నిందించకండి, ఎందుకంటే మీ ప్రజలు యాజకుని మీద నేరం మోపుతారు.
5
మీరు పగలు రాత్రులు తడబడతారు, ప్రవక్తలు మీతో కలిసి తడబడతారు, కాబట్టి నేను నీ తల్లిని నాశనం చేస్తాను.
6
జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు. “మీరు జ్ఞానాన్ని త్రోసివేశారు కాబట్టి, నేను కూడా మిమ్మల్ని నా యాజకులుగా ఉండకుండా త్రోసివేస్తున్నాను; మీరు మీ దేవుని ఉపదేశాన్ని పట్టించుకోలేదు కాబట్టి, నేను కూడా మీ పిల్లలను పట్టించుకోను.
Settings