Skip to content
హోషేయ 13:1-3

హోషేయ 13:1-3

1
ఎఫ్రాయిం మాట్లాడినప్పుడు ప్రజలు వణికారు; అతడు ఇశ్రాయేలులో ఘనపరచబడ్డాడు. కాని అతడు బయలును పూజించి అపరాధిగా చనిపోయాడు.
2
ఇప్పుడు వారు మరి ఎక్కువ పాపం చేస్తున్నారు; వారు వెండితో తమ కోసం విగ్రహాలను చేసుకుంటున్నారు, అవి నైపుణ్యంతో చేయబడిన ప్రతిమలు, అవన్నీ కళాకారుని చేతిపనులు. ఈ ప్రజల గురించి ఇలా చెప్తారు, “వారు నరబలులు అర్పిస్తారు! దూడ విగ్రహాలను ముద్దు పెట్టుకుంటారు!”
3
కాబట్టి వారు ఉదయకాలపు పొగలా ఉంటారు, ఉదయకాలపు మంచులా అదృశ్యం అవుతారు, నూర్పిడి కళ్ళంలో నుండి గాలికి ఎగిరే పొట్టులా ఉంటారు, కిటికీలో గుండా పోయే పొగలా అయిపోతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options