హెబ్రీయులకు 6:1-8
1
అందువల్ల మనం క్రీస్తు గురించిన ప్రాధమిక బోధన అంటే, మరణానికి దారితీసే చర్యల నుండి పశ్చాత్తాపం, దేవుని యందు విశ్వాసముంచడం వంటి వాటితో మళ్ళీ పునాదిని మళ్ళీ వేయక, దానికి మించి, పరిపక్వతకు వైపుకు వెళ్దాం,
2
శుద్ధీకరణ ఆచారాలు, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానం, నిత్య తీర్పు గురించిన మళ్ళీ ఉపదేశం అవసరం లేదు.
3
దేవుడు అనుమతిస్తే, మనం అలా చేద్దాము.
4
ఒకసారి వెలిగించబడి, పరలోకసంబంధమైన వరాలను అనుభవించినవారు తెలుసుకొని, పరిశుద్ధాత్మలో పాలిభాగస్థులై,
5
దేవుని వాక్యం యొక్క అనుగ్రహాన్ని, భవిష్యత్కాలాల శక్తుల ప్రభావాలను రుచి చూసినప్పటికి,
6
తప్పిపోయినవారిని తిరిగి పశ్చాత్తాపం వైపుకు నడిపించడం అసాధ్యము. అలాంటివారు తమ నాశనానికే దేవుని కుమారుని మళ్ళీ సిలువవేస్తూ, ఆయనను బహిరంగంగా అవమానానికి గురిచేస్తున్నారు.
7
భూమి తనపై తరచుగా కురిసే వర్షపు నీటిని త్రాగి, దానిపై వ్యవసాయం చేసేవారికి ప్రయోజనకరమైన పంటను ఇస్తుండగా పండించినవారు దాన్ని దేవుని దీవెనగా పొందుతున్నారు.
8
అయితే ముళ్ళపొదలను కలుపు మొక్కలను పండించే భూమి విలువలేనిదై శాపానికి గురి అవుతుంది ఆ తర్వాత చివరిలో అది కాల్చివేయబడుతుంది.
Settings