హెబ్రీయులకు 10:32-39
32
మీరు వెలుగును పొందిన తర్వాత, అనేక శ్రమలతో నిండిన గొప్ప పోరాటాన్ని మీరు ఓర్చుకున్న ప్రారంభపు రోజులను జ్ఞాపకం చేసుకోండి.
33
కొన్నిసార్లు మీరు బహిరంగంగా అవమానపరచబడ్డారు, హింసించబడ్డారు; మరికొన్నిసార్లు మీరు అలాంటివి అనుభవించిన వారితో పాలివారయ్యారు.
34
చెరసాలలో వేయబడిన వారితో పాటు మీరు శ్రమ అనుభవించారు, మీ ఆస్తులను దోచుకున్నా సంతోషంగా స్వీకరించారు, వాటికంటే శాశ్వతంగా నిలిచే మరింత మేలైన ఆస్తులను కలిగి ఉన్నారని మీకు తెలుసు కాబట్టి మీరు వాటిని భరించారు.
35
కాబట్టి మీ ధైర్యాన్ని కోల్పోవద్దు; దానికి మీరు గొప్ప ఫలాన్ని పొందుతారు.
36
దేవుని చిత్తాన్ని చేసేప్పుడు మీరు పట్టుదలగా ఉండడం అవసరం, ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకుంటారు.
37
“ఎందుకంటే ఇంకాసేపట్లో, రాబోయేవాడు వస్తాడు ఆలస్యం చేయడు.”
38
ఇంకా, “నా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. అయితే వెనుతిరిగే వానిని బట్టి నా హృదయం ఏమాత్రం ఆనందించదు.”
39
అయితే మనం వెనుతిరిగి నశించేవారితో లేము, కానీ విశ్వాసం కలిగి, తమ ఆత్మలను కాపాడుకునేవారితో ఉన్నాము.
Settings