Skip to content
హబక్కూకు 2:6-17

హబక్కూకు 2:6-17

6
“అయితే వారందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఈ సామెత చెబుతారు, “ ‘దొంగిలించిన వస్తువులను పోగుచేసి బలత్కారంతో ధనవంతునిగా మారిన వారికి శ్రమ! ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?’
7
అప్పు ఇచ్చినవారు నీ మీద అకస్మాత్తుగా పడరా? వారు లేచి నీకు వణుకు పుట్టించరా? అప్పుడు వారు నిన్ను దోచుకుంటారు.
8
నీవు అనేక దేశాలను దోచుకున్నావు కాబట్టి, మిగిలి ఉన్న ప్రజలంతా నిన్ను దోచుకుంటారు. నీవు నరహత్యలు చేసినందుకు, భూములను పట్టణాలను వాటిలోని వారందరినీ నాశనం చేసినందుకు ప్రజలు నిన్ను దోచుకుంటారు.
9
“తనకు నాశనం కలుగకుండా తన నివాసాన్ని ఎత్తు చేసుకుని అన్యాయమైన సంపాదనతో తన ఇంటిని నిర్మించుకునే వారికి శ్రమ!
10
అనేక ప్రజలను నాశనం చేయడానికి కుట్రచేసి నీ ఇంటివారి మీదికి అవమానం తెచ్చుకుని నీ ప్రాణాన్ని కోల్పోతున్నావు.
11
గోడ రాళ్లు మొరపెడతాయి, చెక్క దూలాలు వాటిని ప్రతిధ్వనింపచేస్తాయి.
12
“రక్తం చిందించి పట్టణాన్ని నిర్మించేవారికి అన్యాయంతో ఊరిని స్థాపించేవారికి శ్రమ!
13
ప్రజలు కష్టపడతారు కాని అగ్ని పాలవుతారని, వ్యర్థమైన దాని కోసం కష్టపడి జనులు అలసిపోతారని సైన్యాల యెహోవా నిర్ణయించలేదా?
14
నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు యెహోవా మహిమాన్విత జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.
15
“తన పొరుగువారి నగ్న శరీరాలను చూడాలని, వారు మత్తులో మునిగిపోయేలా కోపంతో వారికి ద్రాక్షరసం పోసేవారికి శ్రమ!
16
కీర్తికి బదులుగా నీకు అవమానం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు నీ వంతు! నీవు కూడా త్రాగి నీ నగ్నత్వాన్ని చూపించుకుంటావు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ దగ్గరకు వస్తోంది, అవమానం నీ కీర్తిని కప్పివేస్తుంది.
17
లెబానోనుపై నీవు చేసిన హింస నీ మీదికే వస్తుంది, పశువులను నాశనం చేసినందుకు నీ మీదికి భయంకరమైన తీర్పు వస్తుంది. నీవు మనుష్యులను హత్య చేసినందుకు, దేశాలను పట్టణాలను వాటి నివాసులను నాశనం చేసినందుకు ఇలా జరుగుతుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options