ఆదికాండము 43:26-34
26
యోసేపు ఇంటికి రాగానే, వారు ఇంట్లోకి తెచ్చిన కానుకలను అతనికి ఇచ్చి, అతని ఎదుట సాష్టాంగపడ్డారు.
27
వారు ఎలా ఉన్నారని వారిని అడిగి, “వృద్ధుడైన మీ తండ్రి గురించి మీరు నాకు చెప్పారు కదా, ఆయన ఎలా ఉన్నారు? ఇంకా బ్రతికే ఉన్నారా?” అని అన్నాడు.
28
వారు జవాబిస్తూ, “తమ దాసుడు, మా తండ్రి బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు” అన్నారు, అప్పుడు వారు తలవంచి, సాష్టాంగపడ్డారు.
29
యోసేపు కళ్ళెత్తి తన తమ్ముడు అనగా తన సొంత తల్లి కుమారుడైన బెన్యామీనును చూసి, “మీరు నాకు చెప్పిన మీ చిన్న తమ్ముడు ఇతడేనా?” అని అడిగి, “నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక!” అని అన్నాడు.
30
తమ్మున్ని చూడగానే యోసేపుకు అతని మీద ప్రేమ పొర్లుకు వచ్చింది, అందుకు అతడు వెంటనే లోపలి గదిలోకి వెళ్లి ఏడ్చాడు.
31
తన ముఖం కడుక్కున్న తర్వాత, తనను తాను అదుపుచేసుకుని, “భోజనం వడ్డించండి” అని చెప్పాడు.
32
సేవకులు యోసేపుకు తన బల్ల దగ్గర, అతని సోదరులకు వేరే బల్ల దగ్గర, అతనితో భోజనంచేస్తున్న ఈజిప్టువారికి వరుసగా భోజనం వడ్డించారు, ఎందుకంటే హెబ్రీయులతో కలసి భోజనం చేయడం ఈజిప్టువారికి అసహ్యము.
33
వారి వయస్సు ప్రకారం మొదటివాడు మొదలుకొని చివరివాని వరకు అతని ఎదుట కూర్చున్నారు; వారు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు.
34
యోసేపు బల్ల నుండి వారికి భోజనం వడ్డించబడినప్పుడు, ఇతరులకంటే అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. కాబట్టి వారు అతనితో స్వేచ్ఛగా విందు చేసుకున్నారు, త్రాగారు.
Settings