Skip to content
ఆదికాండము 33:12-16

యాకోబు మరియు ఏశావు విడిపోవుట

ఆదికాండము 33:12-16
12
అప్పుడు ఏశావు, “మనం వెళ్తూ ఉందాము; నేను మీతో వస్తాను” అని అన్నాడు.
13
కానీ యాకోబు అతనితో, “నా దగ్గర ఉన్నవి పసిపిల్లలు, గొర్రెలు, మేకలు వాటికి పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వీటిని త్వరపెట్టి తోలితే, పశువులన్నీ చస్తాయి.
14
కాబట్టి నా ప్రభువు తన సేవకునికి ముందుగా వెళ్లాలి. నేను శేయీరులో ఉన్న నా ప్రభువు దగ్గరకు వచ్చేవరకు, నా ముందున్న గొర్రెల మందలు పశువుల మందలు, అలాగే ఈ పసిపిల్లలు నడువగలిగిన దానిని బట్టి వాటిని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకువస్తాను” అని అన్నాడు.
15
అందుకు ఏశావు, “అలాగైతే నా మనుష్యుల్లో కొందరిని మీతో ఉంచుతాను” అని అన్నాడు. “అలా ఎందుకు? నా ప్రభువు దృష్టిలో దయ ఉంటే చాలు” అని యాకోబు అన్నాడు.
16
కాబట్టి ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం చేశాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options