గలతీయులకు 2:9-10
9
సంఘానికి మూలస్తంభాలుగా పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను అనేవారు దేవుడు నాకిచ్చిన కృపను గుర్తించినపుడు మమ్మల్ని స్వీకరించి మాతో సహవాస సూచనగా నాకు బర్నబాకు తమ కుడిచేతిని అందించారు. మేము యూదేతరుల దగ్గరకు, వారు యూదుల దగ్గరకు వెళ్లాలని అంగీకరించారు.
10
అయితే వారు అడిగింది ఏంటంటే, మేము పేదవారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని వారు కోరారు; ఎప్పుడు నేను చేయాలని కోరుకునేది కూడా అదే.
Settings