Skip to content
ఎజ్రా 2:53-63

ఎజ్రా 2:53-63

53
బర్కోసు, సీసెరా, తెమహు వారసులు,
54
నెజీయహు, హటీపా వారసులు.
55
సొలొమోను సేవకుల వారసులు: సొటయి, హస్సోఫెరెతు, పెరూదా వారసులు,
56
యహలా, దర్కోను, గిద్దేలు వారసులు,
57
షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, అమీ వారసులు.
58
ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392.
59
తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు. అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు:
60
దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు, మొత్తం 652.
61
యాజకుల వారసులు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వారసులు (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు).
62
వీరు వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు.
63
ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.