Skip to content
యెహెజ్కేలు 4:12-15

యెహెజ్కేలు 4:12-15

12
యవలతో రొట్టెలు చేసుకుని ప్రజలంతా చూస్తుండగా మానవ మలంతో వాటిని కాల్చుకుని తినాలి.
13
నేను వారిని ఏ జాతుల మధ్యకు వెళ్లగొడతానో వారి మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అపవిత్రమైన ఆహారం తింటారు” అని యెహోవా నాకు చెప్పారు.
14
అప్పుడు నేను, “అలా కాదు, ప్రభువా, యెహోవా! నన్ను నేను ఎప్పుడూ అపవిత్రం చేసుకోలేదు. నా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు చనిపోయింది గాని అడవి జంతువులు చంపిన దానిని గాని నేను తినలేదు. ఏ అపవిత్రమైన మాంసం నా నోటిలోకి వెళ్లలేదు” అని అన్నాను.
15
అందుకు ఆయన, “మంచిది, అలా అయితే మానవ మలం బదులు ఆవు పేడ మీద కాల్చడానికి నేను నిన్ను అనుమతిస్తాను” అని అన్నారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options