Skip to content
యెహెజ్కేలు 35:7-15

యెహెజ్కేలు 35:7-15

7
నేను శేయీరు పర్వతాన్ని నిర్జనంగా వ్యర్థంగా చేస్తాను, వస్తూ వెళ్తూ ఉండేవారు అక్కడ లేకుండా చేస్తాను.
8
నీ పర్వతాలను శవాలతో నింపుతాను; ఖడ్గం చేత చచ్చినవారు నీ కొండలమీద, నీ లోయల్లో, నీ వాగుల్లో పడి ఉంటారు.
9
నేను నిన్ను శాశ్వతంగా పాడైపోయేలా చేస్తాను; నీ పట్టణాల్లో ఎవరూ నివసించరు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
10
“ ‘యెహోవానైన నేను అక్కడ ఉన్నప్పటికీ, “ఈ రెండు జాతులు, దేశాలు మనవే; మనం వాటిని స్వాధీనం చేసుకుందాం” అని మీరు చెప్పారు.
11
కాబట్టి నా జీవం తోడు నీవు వారిమీద ద్వేషంతో నీవు వారికి చూపించిన కోపం అసూయను బట్టి నేను నీ పట్ల తగిన రీతిగా వ్యవహరిస్తాను. నేను నిన్ను శిక్షించినప్పుడు నన్ను నేను వారికి పరిచయం చేసుకుంటాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
12
“అవి పాడుచేయబడ్డాయి, మనకు ఆహారంగా ఇవ్వబడ్డాయి” అని నీవు ఇశ్రాయేలు పర్వతాలను దూషించిన మాటలన్నీ యెహోవానైన నేను విన్నానని నీవు తెలుసుకుంటావు.
13
మీరు ప్రగల్భాలు పలుకుతూ, ఏమాత్రం అదుపు లేకుండా నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, అదంతా నేను విన్నాను.
14
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఒకవైపు లోకమంతా సంతోషిస్తూ ఉంటే, నేను నిన్ను నాశనం చేస్తాను.
15
ఇశ్రాయేలీయుల వారసత్వం పాడైపోయినప్పుడు నీవు సంతోషించావు, కాబట్టి నేను నీతో అలాగే వ్యవహరిస్తాను. శేయీరు పర్వతమా, నీవూ నీతో పాటు ఎదోము అంతా పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options