Skip to content
యెహెజ్కేలు 35:5-9

ఎదోము నిత్య ద్వేషము

యెహెజ్కేలు 35:5-9
5
“ ‘నీవు ఇశ్రాయేలీయుల పట్ల ఎప్పుడూ పగతో ఉండి, వారి విపత్తు సమయంలో, వారి శిక్ష ముగింపుకు చేరుకున్న సమయంలో నీవు వారిని ఖడ్గానికి అప్పగించావు,
6
కాబట్టి నా జీవం తోడు, నేను నిన్ను రక్తపాతానికి అప్పగిస్తాను, అది నీ వెంటపడుతుంది. నీవు రక్తపాతాన్ని ద్వేషించలేదు కాబట్టి, రక్తపాతం నిన్ను వెంటాడుతుందని యెహోవా ప్రకటిస్తున్నారు.
7
నేను శేయీరు పర్వతాన్ని నిర్జనంగా వ్యర్థంగా చేస్తాను, వస్తూ వెళ్తూ ఉండేవారు అక్కడ లేకుండా చేస్తాను.
8
నీ పర్వతాలను శవాలతో నింపుతాను; ఖడ్గం చేత చచ్చినవారు నీ కొండలమీద, నీ లోయల్లో, నీ వాగుల్లో పడి ఉంటారు.
9
నేను నిన్ను శాశ్వతంగా పాడైపోయేలా చేస్తాను; నీ పట్టణాల్లో ఎవరూ నివసించరు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.