కంటెంట్‌కు వెళ్లండి
యెహెజ్కేలు 34:11-16

మంచి కాపరిగా ప్రభువు

యెహెజ్కేలు 34:11-16
11
“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేనే స్వయంగా నా గొర్రెలను వెదికి వాటిని చూసుకుంటాను.
12
గొర్రెల కాపరి చెదిరిపోయిన తన మందను వెదకినట్లు నేను నా గొర్రెలను వెదకుతాను. మేఘాలు కమ్మి చీకటిగా ఉన్న రోజున, అవి ఎక్కడెక్కడ చెదిరిపోయాయో అక్కడ నుండి నేను వాటిని రక్షిస్తాను.
13
నేను వాటిని ఇతర జాతుల నుండి బయటకు రప్పించి, దేశాల నుండి వాటిని సమకూర్చి, నేను వాటిని వారి స్వదేశానికి తీసుకువస్తాను. నేను వాటిని ఇశ్రాయేలు పర్వతాలమీద, కనుమలలో, దేశంలోని అన్ని నివాస స్థలాల్లో మేపుతాను.
14
మంచి పచ్చిక ఉన్నచోట వాటిని మేపుతాను, ఇశ్రాయేలీయుల ఎత్తైన పర్వతాలు వాటికి పచ్చికబయళ్లుగా ఉంటాయి. అందులో అవి హాయిగా పడుకుంటాయి. ఇశ్రాయేలు పర్వతాలమీద శ్రేష్ఠమైన మేత ఉన్న స్థలాల్లో అవి మేస్తాయి.
15
నేనే స్వయంగా నా గొర్రెలను మేపి వాటిని పడుకోబెడతాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
16
నేను తప్పిపోయిన వాటిని వెదికి, తోలివేసిన వాటిని తిరిగి తోలుకు వస్తాను. నేను గాయపడిన వాటికి కట్టుకడతాను. బలహీనమైన వాటిని బలపరుస్తాను. క్రొవ్విన వాటిని బలిసిన వాటిని నాశనం చేస్తాను. మందను న్యాయంగా మేపుతాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options