Skip to content
యెహెజ్కేలు 34:1-10

ఇశ్రాయేలు అబద్ధ కాపరులకు వ్యతిరేకంగా ప్రవచనము

యెహెజ్కేలు 34:1-10
1
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
2
“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు కాపరులకు వ్యతిరేకంగా ప్రవచించు; ప్రవచించి వారితో ఇలా చెప్పు: ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకునే ఇశ్రాయేలు కాపరులారా మీకు శ్రమ! కాపరులు తమ గొర్రెల మందను జాగ్రత్తగా చూసుకోవాలి కదా?
3
మీరు క్రొవ్విన వాటిని తింటారు, ఉన్నితో బట్టలు వేసుకుంటారు, ఎంపిక చేసిన జంతువులను వధిస్తారు, కానీ మందను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోరు.
4
మీరు బలహీనమైన వాటిని బలపరచలేదు, రోగంతో ఉన్నవాటిని స్వస్థపరచలేదు, గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. మీరు దారితప్పిన వాటిని తిరిగి తీసుకురాలేదు, తప్పిపోయిన వాటికోసం వెదకలేదు. మీరు వాటిని కఠినంగా, క్రూరంగా పాలించారు.
5
కాపరి లేనందున అవి చెదిరిపోయాయి, అవి చెదిరిపోయి అడవి జంతువులన్నిటికి ఆహారమయ్యాయి.
6
నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదా, ఎత్తైన ప్రతి కొండ మీదా సంచరించాయి. వారు భూమి అంతటా చెల్లాచెదురుగా ఉన్నారు, ఎవరూ వాటిని వెదకలేదు, వాటికోసం చూడలేదు.
7
“ ‘కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి:
8
నా జీవం తోడు కాపరులు లేని నా గొర్రెలు దోచుకోబడ్డాయి, అడవి మృగాలన్నిటికి ఆహారమయ్యాయి, నా కాపరులు నా గొర్రెలను వెదకలేదు, నా గొర్రెలను జాగ్రత్తగా చూసుకోకుండా వారు తమ గురించి మాత్రమే చూసుకున్నారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
9
కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి:
10
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఆ కాపరులకు వ్యతిరేకిని, నా మంద గురించి నేను వారిని లెక్క అడుగుతాను. గొర్రెల కాపరులు ఇకపై మందను మేపకుండ నేను వారిని తొలగిస్తాను, తద్వార వారు తమను తాము పోషించుకోలేరు. వారి నోటి నుండి నేను నా మందను విడిపిస్తాను, ఇకపై అది వారికి ఆహారంగా ఉండదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options