- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
మొదటి విలాపగీతము: ఫరోపై దేవుని తీర్పు
యెహెజ్కేలు 32:1-16
1
పన్నెండవ సంవత్సరం, పన్నెండవ నెల మొదటి రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
2
“మనుష్యకుమారుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: “ ‘దేశాల మధ్య సింహంవంటివాడవు; నీవు నీ ప్రవాహంలో కొట్టుకుపోతూ, నీ పాదాలతో నీటిని చిమ్ముతూ, ప్రవాహాలను బురదమయం చేస్తూ, సముద్రాల్లో ఉండే భీకరమైన సముద్ర జీవిలాంటి వాడవు.
3
“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘గుంపులు గుంపులుగా ప్రజలు చేరినప్పుడు నేను నీ మీద వల వేస్తాను; నా వలలో చిక్కిన నిన్ను వారంతా నీటిలో నుండి బయటకు లాగుతారు.
4
నేను నిన్ను నేల మీద పడవేసి బయట పొలంలో విసిరివేస్తాను. ఆకాశ పక్షులను నీ మీద వ్రాలనిస్తాను, అడవి జంతువులను వాటి కడుపునిండా నిన్ను తినేలా చేస్తాను.
5
నీ మాంసాన్ని పర్వతాలమీద వెదజల్లుతాను, నీ శవాలతో లోయలన్నిటిని నింపుతాను.
6
నేను నీ రక్తధారలతో భూమిని పర్వతాల వరకు తడుపుతాను, లోయలు నీ మాంసంతో నిండిపోతాయి.
7
నేను నిన్ను ఆర్పివేసి ఆకాశాన్ని మూసివేస్తాను. నక్షత్రాలను చీకటిగా చేస్తాను; సూర్యుని మబ్బుతో కప్పుతాను చంద్రుడు ప్రకాశించడు.
8
నీ వలన ఆకాశంలోని జ్యోతులను చీకటిగా చేస్తాను నీ దేశం మీద గాఢాంధకారం కమ్మేలా చేస్తాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
9
నీకు తెలియని దేశాల మధ్య అనేక జనాంగాల మధ్య నేను నీ మీదికి నాశనం తెచ్చినప్పుడు అనేక జనాంగాల హృదయాలకు కలవరం కలిగిస్తాను.
10
నేను వారి ముందు నా ఖడ్గాన్ని ఆడించినప్పుడు, నీ కారణంగా అనేకమందికి కలవరాన్ని కలిగిస్తాను, వారి రాజులు నిన్ను చూసి భయపడతారు. నీవు కూలిపోయిన రోజున వారంతా ప్రాణభయంతో నిత్యం వణికిపోతారు.
11
“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘బబులోను రాజు ఖడ్గం నీ మీదికి వస్తుంది.
12
అన్ని జాతులలో అతి క్రూరులైన బల శూరుల ఖడ్గంతో నీ సైన్యం పతనమయ్యేలా చేస్తాను. వారు ఈజిప్టువారి గర్వాన్ని అణచివేస్తారు, దాని అల్లరిమూకలు నాశనమైపోతాయి.
13
సమృద్ధి జలాల ప్రక్కన ఉన్న దాని పశువులన్నిటిని నేను నాశనం చేస్తాను, ఇకపై నరుని పాదాలు వాటిని కదల్చవు, పశువుల కాళ్లు వాటిని బురదమయం చేయవు.
14
అప్పుడు నేను జలాలను నిమ్మళింపజేసి, దాని ప్రవాహాలను నూనెలా ప్రవహించేలా చేస్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
15
నేను ఈజిప్టును పాడు చేసినప్పుడు, అందులో ఉన్నవాటన్నిటిని నాశనం చేసినప్పుడు, దానిలో నివసించే వారినందరిని నిర్మూలం చేసినప్పుడు, నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’
16
“వారు ఆమె కోసం ఈ విలాప గీతం పాడతారు. ఆయా దేశాల కుమార్తెలు దానిని పాడతారు; ఈజిప్టు కోసం, దాని అల్లరిమూకలన్నిటి కోసం వారు దానిని పాడతారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
Settings