కంటెంట్‌కు వెళ్లండి
యెహెజ్కేలు 30:1-9

ఐగుప్తుపై యెహోవా దినము

యెహెజ్కేలు 30:1-9
1
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
2
“మనుష్యకుమారుడా, ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘రోదిస్తూ అనండి: “అయ్యో, శ్రమ దినం వచ్చిందే!”
3
ఎందుకంటే ఆ రోజు వచ్చేసింది, యెహోవా దినం సమీపించింది, మబ్బులు కమ్ముకునే రోజు, జనాంగాలు శిక్షించబడే రోజు.
4
ఈజిప్టు దేశం మీదికి ఖడ్గం దూసుకువస్తుంది, కూషు మీదికి వేదన వస్తుంది. ఈజిప్టులో హతులైనవారు పడిపోతుంటే, దాని సంపదను తీసుకెళ్లిపోతారు, దాని పునాదులు కూల్చివేయబడతాయి.
5
కూషు వారు, లిబియా వారు (పూతు వారు), లిడియా వారు, అరేబియా అంతా, కూబు వారు, ఇంకా నిబంధన దేశపు ప్రజలు ఈజిప్టుతో పాటు ఖడ్గానికి కూలిపోతారు.
6
“ ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఈజిప్టు సహాయకులు కూలిపోతారు, దాని బల గర్వం అణిగిపోతుంది. మిగ్దోలు నుండి సైనే వరకు ప్రజలు దాని లోపలే ఉన్న ఖడ్గానికి కూలిపోతారు. అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
7
పాడైపోయిన దేశాల మధ్య ఈజిప్టువారు దిక్కులేని వారవుతారు. శిథిలమైన పట్టణాల మధ్య వారి పట్టణాలు పడి ఉంటాయి.
8
ఈజిప్టు దేశంలో అగ్ని రగిలించబడి దాని సహాయకులంతా నలిపివేయబడినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
9
“ ‘ఆ రోజున దూతలు నా దగ్గర నుండి ఓడలలో బయలుదేరి నిర్భయంగా ఉన్న కూషును భయపెడతారు. ఈజిప్టుకు తీర్పు తీర్చబడిన రోజున వారికెంతో భయాందోళనలు కలుగుతాయి. అది తప్పనిసరిగా వస్తుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options