Skip to content
యెహెజ్కేలు 27:12

యెహెజ్కేలు 27:12

చుట్టుపక్కల సందర్భంతో వచనం 12 చూపబడుతోంది.
9
నీ ఓడను బాగుచేయడానికి గెబాలుకు చెందిన పెద్దలు, అనుభవజ్ఞులైన చేతి పనివారు ఉన్నారు. సముద్రంలో నీ వస్తువులు కొనడానికి, సముద్రపు నావికుల ఓడలన్నీ నీ రేవులో ఉన్నాయి.
10
“ ‘పర్షియా మనుష్యులారా, లిడియా, పూతుకు చెందినవారు నీ సైన్యంలో సైనికులుగా పని చేశారు. వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీసి, నీకు వైభవాన్ని తెస్తున్నారు.
11
అర్వాదు వారు, హెలెకు వారు అన్నివైపులా నీ గోడలకు కాపలా కాసారు; గమ్మాదీయులు నీ గోపురాలలో ఉన్నారు. వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీశారు; వారు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు.
12
“ ‘నీ గొప్ప సంపదను బట్టి తర్షీషు వారు నీతో వ్యాపారం చేశారు; వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి మీ సరుకు తీసుకున్నారు.
13
“ ‘గ్రీసు, తుబాలు, మెషెకు వారు నీతో వ్యాపారం చేశారు; మనుష్యులను, ఇత్తడి వస్తువులను ఇచ్చి మీ వస్తువులను కొన్నారు.
14
“ ‘బేత్ తోగర్మా వారు మీ సరుకు కోసం రథ గుర్రాలు, అశ్వికదళ గుర్రాలు కంచరగాడిదలను ఇచ్చారు.
15
“ ‘దేదాను వారు నీతో వ్యాపారం చేశారు, చాలా తీర ప్రాంతాల ప్రజలు నీ సరుకు కొన్నారు; వారు మీకు దంతపు దంతాలు, తునికి కలప ఇచ్చారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options