యెహెజ్కేలు 24:20-27
20
అప్పుడు నేను వారితో ఇలా అన్నాను, “యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
21
ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీకు గర్వకారణంగా, మీ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేదిగా, మీరు అభిమానించే నా పరిశుద్ధాలయాన్ని నేను అపవిత్రం చేయబోతున్నాను. మీరు వెనుక విడిచిపెట్టిన మీ కుమారులు, కుమార్తెలు కత్తివేటుకు కూలిపోతారు.
22
అప్పుడు నేను చేసినట్లే మీరు కూడా చేస్తారు. మీ మీసం గడ్డం కప్పుకోరు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినరు.
23
మీ తలపాగాలు మీ తలల మీద నుండి తీయరు మీ చెప్పులు మీ కాళ్లకే ఉంటాయి. మీరు దుఃఖించరు ఏడవరు కానీ మీలో మీరే మూల్గుతూ మీ పాపాల కారణంగా క్రుంగిపోతారు.
24
యెహెజ్కేలు నీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిందంతా మీరూ చేస్తారు. ఇది జరిగినప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
25
“మనుష్యకుమారుడా, నేను వారి ఆశ్రయాన్ని, వారి ఆనందాన్ని కీర్తిని, వారి కళ్లకు ఇష్టమైన దానిని, వారి హృదయ ఆశలను అలాగే వారి కుమారులను కుమార్తెలను తీసివేసే రోజు వస్తుంది.
26
ఆ రోజున నీకు వార్త చెప్పడానికి ఒకడు తప్పించుకుని నీ దగ్గరకు వస్తాడు.
27
అప్పుడు నీవు మౌనంగా ఉండకుండా తప్పించుకుని వచ్చిన వానితో నోరు తెరిచి స్పష్టంగా మాట్లాడతావు. నేనే యెహోవానని వారు తెలుసుకోవడానికి ఇలా నీవు వారికి ఒక సూచనగా ఉంటావు.”
Settings