కంటెంట్‌కు వెళ్లండి
యెహెజ్కేలు 23:11-21

అహోలీబా (యెరూషలేము) తన అక్క పాపమును అనుసరించుట

యెహెజ్కేలు 23:11-21
11
“దాని చెల్లి ఒహోలీబా ఇదంతా చూసింది, అయినాసరే కామంలో వ్యభిచారంలో దాని అక్కను మించి దిగజారిపోయింది.
12
అది కూడా అష్షూరు వారిలో సైన్యాధిపతులు, అధికారులను, నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, గుర్రాలు స్వారీ చేసేవారిని, అందమైన యువకులను మోహించింది.
13
అది కూడా తనను తాను అపవిత్రపరచుకోవడం నేను చూశాను; వారిద్దరు ఒకే దారిలో వెళ్లారు.
14
“అయితే అది వ్యభిచారాన్ని మరింత ఎక్కువగా చేసింది. అది గోడపై ఎరుపు రంగులో చిత్రీకరించబడిన కల్దీయుల పురుషుల చిత్రాలను చూసింది.
15
వారు నడుములకు దట్టీలు, తలలపై తలపాగాలు ధరించిన బబులోను రథ అధికారుల్లా, కల్దీయ సంతానంలా కనిపించారు.
16
అది వారిని చూడగానే వారిని మోహించి, కల్దీయలో ఉన్న వారి దగ్గరకు దూతలను పంపింది.
17
అప్పుడు బబులోనువారు దాని పడక సుఖాన్ని కోరి వచ్చి వ్యభిచరించి దానిని అపవిత్రం చేశారు. అది వారిచే అపవిత్రపరచబడిన తర్వాత, దాని మనస్సుకు వారంటే అసహ్యం వేసింది.
18
అదలా తన వ్యభిచారాన్ని బహిరంగంగా నిర్వహిస్తూ, తన నగ్న శరీరాన్ని బహిర్గతం చేసినప్పుడు, నేను దాని సోదరిని వదిలేసినట్టే, దీని మీద అసహ్యం కలిగి దీన్ని కూడా వదిలేశాను.
19
అయినప్పటికీ అది ఈజిప్టులో వేశ్యగా ఉన్న తన యవ్వన రోజులను గుర్తుచేసుకుని మరింత వ్యభిచారం చేసింది.
20
గాడిదల్లాంటి పురుషాంగం గుర్రాల్లాంటి వీర్య స్ఖలనం ఉన్న తన ప్రేమికులను అది మోహించింది.
21
కాబట్టి ఈజిప్టులో నీ రొమ్ములను చనుమొనలను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని నీ యవ్వనపు అశ్లీల ప్రవర్తన కొనసాగించాలని ఎంతో ఆశించావు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options