Skip to content
యెహెజ్కేలు 14:4-7

యెహెజ్కేలు 14:4-7

4
కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ ఇశ్రాయేలు సర్వసమాజం తమ హృదయాల్లో విగ్రహాలను పెట్టుకుని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకుని ప్రవక్త దగ్గరకు వెళ్తే వారు చేసే విగ్రహారాధనను బట్టి వారికి యెహోవానైన నేనే స్వయంగా సమాధానం ఇస్తాను.
5
తమ విగ్రహాలన్నిటి కోసం నన్ను విడిచిపెట్టిన ఇశ్రాయేలీయుల హృదయాలను తిరిగి నా వైపు త్రిప్పుకోడానికి నేను ఇలా చేస్తాను.’
6
“కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీ విగ్రహాలను విడిచిపెట్టి అసహ్యకరమైన ఆచారాలు మానివేసి మనస్సు మార్చుకోండి.
7
“ ‘ఇశ్రాయేలీయులు గాని వారి దేశంలో ఉంటున్న విదేశీయులు గాని నన్ను విడిచిపెట్టి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించుకుని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకుని నా దగ్గర విచారణచేయమని వారు ప్రవక్త దగ్గరకు వెళ్తే వారికి యెహోవానైన నేనే స్వయంగా సమాధానం ఇస్తాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options