యెహెజ్కేలు 1:22-28
22
జీవుల తలల పైన విశాలమైనది ఒకటి కనిపించింది. అది స్ఫటికంలా మెరుస్తూ, అద్భుతంగా ఉంది.
23
ఆ విశాలం క్రింద వాటి రెక్కలు ఒకదాని వైపు ఒకటి తిన్నగా చాపి ఉన్నాయి, ప్రతి దాని శరీరాన్ని రెండు రెక్కలు కప్పి ఉంచాయి.
24
ఆ జీవులు కదిలినప్పుడు నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది జలప్రవాహాల ఘోషలా, సర్వశక్తిమంతుని స్వరంలా, సైన్యం నుండి వచ్చే కోలాహలంలా ఉంది. అవి నిలబడినప్పుడు వాటి రెక్కలు క్రిందికి వాల్చాయి.
25
అవి రెక్కలు వాల్చి నిలబడినప్పుడు వాటి తలపైన ఉన్న విశాలం పైనుండి ఒక స్వరం వచ్చింది.
26
వాటి తలపైన ఉన్న విశాలంపైన నీలమణి వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసిన ఒక సింహాసనం వంటిది కనిపించింది. దాని మీద మానవరూపంలో ఉన్న ఒకడు కూర్చున్నాడు.
27
అతని నడుము నుండి పైభాగం చుట్టూరా అగ్నిలో కరుగుతున్న ఇత్తడిలా, క్రింది భాగం అగ్నిలా నాకు కనిపించింది. అతని చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఉంది.
28
వర్షం కురుస్తున్న రోజు మేఘాలలో వానవిల్లు కనిపించినట్లు, అతని చుట్టూ ఉన్న తేజస్సు కూడా అలాగే ఉంది. ఇది యెహోవా మహిమ రూపము. నేను దానిని చూసినప్పుడు, నేను నేల మీద పడిపోయాను, ఒక స్వరం నాకు వినిపించింది.
Settings