ఎస్తేరు 6:11-14
11
కాబట్టి హామాను రాజవస్త్రాలు, గుర్రం తీసుకువచ్చి మొర్దెకైకు ఆ వస్త్రాలు ధరింపజేసి గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి నగర వీధుల్లో వెళ్తూ, “రాజు ఓ వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఇలా అతనికి చేయబడుతుంది!” అని అంటూ ఊరేగింపు చేశాడు.
12
తర్వాత మొర్దెకై రాజ ద్వారం దగ్గరకు తిరిగి వచ్చాడు. కాని హామాను దుఃఖంతో తల కప్పుకుని వేగంగా ఇంటికి వెళ్లి,
13
హామాను తనకు జరిగిందంతా తన భార్య జెరషుకు, తన స్నేహితులందరికి తెలియజేశాడు. అతని సలహాదారులు, అతని భార్య జెరెషు అతనితో అన్నారు, “ఎవరి ఎదుట నీ పతనం ప్రారంభమైందో, ఆ మొర్దెకై యూదుడు కాబట్టి, అతని ఎదుట నీవు నిలబడలేవు, నీవు ఖచ్చితంగా పడిపోతావు.”
14
వారింకా మాట్లాడుకుంటున్నప్పుడు, రాజు యొక్క నపుంసకులు వచ్చి, ఎస్తేరు రాణి చేయించిన విందుకు రమ్మని హామానును తొందరపెట్టారు.
Settings