ప్రసంగి 4:3
చుట్టుపక్కల సందర్భంతో వచనం 3 చూపబడుతోంది.
1
సూర్యుని క్రింద జరుగుతున్న అణచివేతనంతటిని నేను చూశాను: సూర్యుని క్రింద అణగారిన వారి కన్నీటిని నేను చూశాను, కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు; బాధపెట్టేవారు బలవంతులు, వారిని ఆదరించేవారెవరూ లేరు.
2
ఇంకా జీవించి ఉన్నవారి కంటే మునుపే చనిపోయినవారు, సంతోషంగా ఉన్నారని నేను అనుకున్నాను.
3
ఇంకా పుట్టనివారు, సూర్యుని క్రింద జరిగే చెడును చూడనివారు, ఈ ఇరువురి కన్నా ధన్యులు.
4
కష్టమంతటితో సాధించినవన్నీ ఒకరిపట్ల ఒకరికి అసూయ కలిగిస్తున్నాయని నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే, గాలికి శ్రమ పడినట్లే.
5
మూర్ఖులు చేతులు ముడుచుకుని తమను తాము పతనం చేసుకుంటారు.
6
రెండు చేతులతో గాలి కోసం శ్రమించడం కంటే ఒక చేతినిండ నెమ్మది ఉంటే అది ఎంతో మేలు.
Settings