ప్రసంగి 10:8-11
8
గొయ్యి త్రవ్వినవారే అందులో పడతారు; గోడను పడగొట్టిన వారే పాము కాటుకు గురవుతారు.
9
రాళ్లు దొర్లించేవారు దానివల్ల గాయపడతారు; మొద్దులను చీల్చేవారు వాటి వల్ల ప్రమాదానికి గురి అవుతారు.
10
ఒకవేళ గొడ్డలి మొద్దుబారి దాని అంచుకు పదును పెట్టకపోతే, ఎక్కువ బలం ఉపయోగించాల్సి ఉంటుంది, అయితే జ్ఞానం విజయాన్ని తెస్తుంది.
11
ఒకవేళ లొంగదీయక ముందే పాము కాటేస్తే, పాములు ఆడించేవానికి లాభం ఉండదు.
Settings